ETV Bharat / state

రైతు వేదిక నిర్మాణానికి శంకుస్థాపన చేసిన పల్లా - రైతు సమన్వయ సమితి

కరోనాతో ప్రపంచ దేశాలు విలవిలలాడుతున్న సమయంలో భారతదేశంలోని ఏ రాష్ట్రంలో చేయని విధంగా 30వేల కోట్ల రూపాయలతో రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్​కే దక్కిందని రాష్ట్ర రైతు బంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. మహబూబాబాద్ జిల్లా మల్యాల గ్రామంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ తో కలిసి రైతు వేదిక భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.

Palla Rajeshwar Reddy Inaugurates Raithu Vedka Construction Works
రైతు వేదిక భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన పల్లా రాజేశ్వర్​ రెడ్డి
author img

By

Published : Jul 19, 2020, 9:08 PM IST

మహబూబాబాద్​ జిల్లా మల్యాల గ్రామంలో రైతుబంధు సమితి రాష్ట్ర ఛైర్మన్​ పల్లా రాజేశ్వర్​ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే శంకర్​ నాయక్​తో కలిసి రైతు వేదిక భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో రైతుబంధు ఇచ్చే పరిస్థితిలో లేదని ప్రతిపక్షాలు వెటకారం చేస్తున్న సమయంలో 7,500 కోట్ల రూపాయలను విడుదల చేసి.. 54 లక్షల మంది రైతుల ఖాతాల్లో నగదు జమ చేసిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికే దక్కిందన్నారు పల్లా రాజేశ్వర్​ రెడ్డి. రైతు వేదికలు రైతులు తమ కష్టాలను, పంటలలో వచ్చే చీడపీడల గురించి మాట్లాడుకునేందుకు ఇతర అవసరాలకు పనికి వస్తుందని, భవిష్యత్తులో రైతు వేదికలు రైతులకు దేవాలయాలుగా మారుతాయన్నారు.

ఎస్సారెస్పీ ప్రాజెక్టు నిండకున్నా కాళేశ్వరం జలాలతో నిండిన మిడ్ మానేరు, లోయర్ మానేరు డ్యామ్​ల నుండి ఎస్సారెస్పీ కాలువలకు నీటిని విడుదల చేశామని, ఆ నీటితో ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు కాళ్లలో కట్టెలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని వారిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాళేశ్వరంపై మూడు వందల కేసులు, పాలమూరు, తుపాకుల గూడెం ప్రాజెక్టులు, సెక్రటేరియట్, ఉస్మానియా ఆస్పత్రులు కట్టకుండా కేసులు వేశారని, ఎవరెన్ని కేసులు వేసినా ఆగేది లేదని.. ప్రాజెక్టులు కట్టి తీరుతామని ఆయన అన్నారు. తెలంగాణ తెచ్చుకున్నది తెలంగాణ శాన్.. తెలంగాణ నిషాన్ కనిపించడానికే అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి మేరకు ఈ ప్రాంత ప్రజలంతా నియంత్రిత సాగు విధానం అవలంభించినందుకు రైతులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చూడండి : దుర్గామాతకు బోనాలు సమర్పించిన మంత్రి అల్లోల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.