మహబూబాబాద్ జిల్లావ్యాప్తంగా కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రాలు చెరువుల్లా మారాయి. భారీ వర్షానికి వరిధాన్యం తడిసి ముద్దయింది. జిల్లా కేంద్రంలో సుమారు రెండు గంటలకు పైగా వాన కురవడంతో కాలువలు ఉప్పొంగి ప్రవహించాయి.
పట్టణంలోని కూరగాయల మార్కెట్లోకి వర్షపు నీరు చేరడంతో వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొనుగోలు కేంద్రాల్లో వరిధాన్యం కుప్పలు తడిసిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ధాన్యాన్ని ప్రభుత్వమే మద్దతు ధరతో కొనుగోలు చేయాలని అన్నదాతలు కోరుతున్నారు.