ఒకవైపు ధరలు సగానికి పడిపోయి ఆందోళన చెందుతున్న అన్నదాతకి మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా ఈ అకాల వర్షం తోడైంది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో కురిసిన అకాల వర్షానికి మహబూబాబాద్ జిల్లాలో మిర్చి, టమాటా రైతులు తీవ్రంగా నష్టపోయారు. మహబూబాబాద్ మండలంలోని పలు గ్రామాలు, తండాల్లో ఈ వర్షాలతో కళ్లాల్లో ఆరబోసిన మిరపకాయ తడిసి ముద్దైంది.
వర్షంలో తడిసిన మిర్చి రంగుమారి ధర తగ్గిపోతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చదవండి: మూసుకుపోయిన హృదయ నాళాలను తెరిపించారిలా