భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం తాక్యా తండాకు చెందిన సేవాతో మహబూబాబాద్ జిల్లా ధారవత్ తండాకు చెందిన బానోత్ కస్తూరికి ఆరేళ్ల క్రితం పెళ్లయ్యింది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. గత రెండు నెలల క్రితం భార్యాభర్తల మధ్య కుటుంబ కలహాలు చోటు చేసుకోవటం వల్ల విడిపోయారు. కస్తూరి తన తల్లి గారింట్లో ఉంటూ పిల్లలను చదివిస్తోంది. గత కొద్ది రోజుల నుంచి మరిపెడలోని ఓ ప్రైవేటు క్లినిక్‌లో స్వీపర్గా పనిచేస్తోంది.
తన భార్యపై భర్త కసి పెంచుకున్నాడు. కస్తూరి ఎక్కడ ఉంటుందో ఆరా తీశాడు. మంగళవారం ఆసుపత్రి వద్దకు వచ్చాడు. ఆమెతో మాట్లాడుతున్నట్లు నటిస్తూ తన వెంట తెచ్చుకున్న కత్తితో గొంతు కోశాడు. తీవ్ర గాయాలపాలైన ఆమె అక్కడికక్కడే దుర్మరణం చెందింది. అనంతరం ఎదురుగా ఉన్న పోలీస్ స్టేషన్‌కి వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ లోని ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు.
ఇవీచూడండి: రోడ్డు ప్రమాదంలో మామ అల్లుడు దుర్మరణం