ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మహబూబాబాద్ ప్రాంత ప్రజల కల త్వరలోనే నెరవేరబోతోందని ఎంపీ మాలోత్ కవిత అన్నారు. సీఎం కేసీఆర్ కృషి ఫలితంగా రాష్ట్రంలో నూతనంగా నిర్మిస్తున్న ఐదు జాతీయ రహదారుల్లో ఎన్.హెచ్ 30 జిల్లాలోని పలు ప్రాంతాలగుండా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వరకు ఏర్పాటుకానుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అనారోగ్యంతో బాధపడుతున్న కొందరికి తన క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయనిధి చెక్కులను ఆమె పంపిణీ చేశారు.
మహబూబాబాద్ జిల్లా నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వరకు రూ. 2 వేల కోట్లతో 234 కి.మీల మేర నిర్మించబోయే రహదారి మహబూబాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలోని 80 శాతం మందికి ఉపయోగపడుతుందని ఎంపీ కవిత తెలిపారు. ఈ రహదారి నిర్మాణపనులను త్వరలోనే ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఈ రోడ్డును మంజూరు చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండి: 'జానారెడ్డి గెలుపుతో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు'