మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం మొట్ల తిమ్మాపురంలో భాజపా నాయకుడు యాప సీతయ్య కుటుంబసభ్యులను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ పరామర్శించారు. ఇటీవలే సీతయ్య కుమార్తె సోనా అంజలి పటేల్ అనారోగ్యంతో మరణించింది. అమె ఎలా మరణించిందో అడిగి తెలుసుకున్నారు.
కరోనా వేగంగా విజృంభిస్తున్న వేళ ధైర్యంగా ఉండాలని కోరారు. ప్రతి ఒక్కరితో భౌతికదూరం పాటిస్తూ మాస్కులు ధరించాలని సూచించారు. సీతయ్య కుటుంబానికి ఎలాంటి కష్టమొచ్చినా భాజపా పార్టీ అండగా నిలుస్తుందని బండి సంజయ్ భరోసానిచ్చారు.
ఇదీ చూడండి: ఆసిఫాబాద్‌లో రెండోరోజు డీజీపీ మహేందర్రెడ్డి పర్యటన