విద్యారంగ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్సీ, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. నూతన ఆవిష్కరణలపై విద్యార్థులు దృష్టి సారించాలని పేర్కొన్నారు. స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్-2020 పోటీల్లో ద్వితీయ బహుమతి అందుకున్న వారిని మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రం జడ్పీ ఉన్నత పాఠశాలలో సన్మానించారు.
ప్రోత్సాహకాలు..
ఛాలెంజ్ పోటీల్లో బహుళ ప్రయోజనాల సంచి అనే ఆవిష్కరణను విద్యార్థులు ప్రదర్శించి రాష్ట్రస్థాయిలో ద్వితీయ బహుమతి అందుకున్నారు. వారితోపాటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌తో కలిసి రాజేశ్వర్‌రెడ్డి సన్మానించారు. ఒక్కొక్కరికీ రూ.10 వేల నగదును ప్రోత్సాహకంగా అందజేశారు.
ఉద్యోగ, ఉపాధ్యాయ ఖాళీలను ప్రభుత్వం భర్తీ చేయనుంది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తోంది. ఆ ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుంది. వ్యవసాయ రంగానికి సర్కార్ పెద్దపీట వేసింది.
-పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ
ఇదీ చూడండి: మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలు... ప్రతిపక్షాల ఆందోళనలు