మహబూబాబాద్ జిల్లా మరిపెడలో వరంగల్-ఖమ్మం-నల్గొండ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస బలపరిచిన అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న మొనగాడు సీఎం కేసీఆర్ అన్నారు. కేసీఆర్ తలలో నాలుకలా పని చేస్తున్న పల్లాను గెలిపించుకోవాలన్నారు. మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల్లో వేరే పార్టీకి తావు లేదన్నారు మంత్రి సత్యవతి రాథోడ్. కేసీఆర్ తరహా పాలన దేశంలో ఎక్కడా లేదన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రెడ్యానాయక్, ఎంపీ కవిత, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ మంత్రి సారయ్య, డీసీసీబీ ఛైర్మన్ రవీందర్‌రావు, డోర్నకల్ నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: 'పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి'