ETV Bharat / state

రాష్ట్రాన్ని తెరాస ఎంతో అభివృద్ధి చేసింది: శంకర్​నాయక్​ - MLA Shankar Nayak latest news

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని యశోద గార్డెన్స్​లో తెరాస మహబూబాబాద్ పట్టణ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే శంకర్​నాయక్​ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడారు.

MLA Shankar Nayak participating in the Trs meeting
రాష్ట్రాన్ని తెరాస ఎంతో అభివృద్ధి చేసింది: శంకర్​నాయక్​
author img

By

Published : Dec 10, 2020, 3:28 AM IST

ఆరున్నర సంవత్సరాల్లో రాష్ట్రాన్ని తెరాస ఎంతో అభివృద్ధి చేసిందని ఎమ్మెల్యే శంకర్ నాయక్ పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని యశోద గార్డెన్స్​లో జరిగిన తెరాస మహబూబాబాద్ పట్టణ విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడారు.

మహబూబాబాద్ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పార్టీ బాగుంటేనే మనం బాగుంటామని, పార్టీని ప్రేమించాలని కార్యకర్తలకు ఉద్బోధ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల వారి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు.

ప్రతిపక్ష పార్టీలకు చెందిన కొంతమంది ప్రభుత్వం పట్ల ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల ముందు వలస పక్షుల్లాగా వచ్చి మాయమాటలు చెప్తారని.. ఏం అభివృద్ధి చేశారో ప్రజలు ప్రశ్నించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ రామ్మోహన్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై కోర్ కమిటీ సమావేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.