మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ చేతుల మీదుగా బియ్యం, పప్పులను జర్నలిస్టులకు అందజేశారు.
కరోనా వైరస్ కట్టడిలో విలేకరుల సేవలు విశిష్టమైనవనని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సమయంలో ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్లు... ప్రజలకు అండగా ఉంటున్నారని, లాక్డౌన్ నిబంధనలను ప్రజలందరూ పాటిస్తూ ఇంట్లోనే ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ మున్సిపల్ ఛైర్మన్ రాంమోహన్ రెడ్డి, తెరాస నాయకులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: కరోనా కట్టడికి మరిన్ని కీలక నిర్ణయాలు