మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక శాసనసభ్యుడు శంకర్ నాయక్ 100 మంది దివ్యాంగులకు బియ్యం పంపిణీ చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రతి రోజు మనకు ఎవరూ కాపలా ఉండరని... ప్రజలు తమను తాము రక్షించుకుంటూ... సమాజాన్ని రక్షించాలని కోరారు. డాక్టర్లు, పోలీసులు, మున్సిపల్ కార్మికులు ఇంత కష్టపడి పని చేస్తున్నా ఫలితం లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
దివ్యాంగులకు బియ్యం పంపిణీ చేసిన ఎమ్మెల్యే - దివ్యాంగులకు బియ్యం పంపిణీ
దేశ వ్యాప్తంగా రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయని ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటించాలన్నారు. అలాగే చేతులను శానిటైజర్లతో శుభ్రం చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు
mahabubabad district latest news