మావోయిస్టు అగ్ర నేత హరిభూషణ్ మరణించడం బాధాకరమైన విషయమని, ఆయన ప్రజల మనిషి అని ములుగు ఎమ్మెల్యే సీతక్క(mla seethakka) అన్నారు. గురువారం హరి భూషణ్(Maoist Hari Bhushan) మరణ వార్త తెలుసుకున్న ఆమె మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం మడగూడెంలోని... ఆయన ఇంటికి చేరుకుని వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
వారు ఆమెపై పడి రోదించడంతో సీతక్క కూడా కన్నీరు పెట్టుకుని ఓదార్చారు. పాకాల కొత్తగూడ ప్రాంతంలో ఆయన టీం లీడరుగా ఉన్నప్పుడు తానూ... ఈ ప్రాంత ప్రజల హక్కుల కోసం ఉద్యమంలో పనిచేశానని ఎమ్మెల్యే గుర్తుచేసుకున్నారు.
పోడు భూముల కోసం ఆ కాలంలో పోరాటం చేశామని తెలిపారు. ప్రజా దర్బార్ నిర్వహించి సమస్యలు పరిష్కరించేవాళ్లమని ఆమె వెల్లడించారు. 33 ఏళ్లు ఉద్యమ ప్రస్థానంలో అనేక ఎత్తు పల్లాలు, ఆటుపోట్లు ఎదుర్కొన్న హరిభూషణ్.. కరోనా కారణంగా మృతి చెందడం బాధాకరమని సీతక్క అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: Nama: ఈడీ విచారణకు హాజరు కానున్న ఎంపీ నామ నాగేశ్వరరావు