రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం వెన్నారానికి చేరుకున్న ఎస్సారెస్పీ జలాలను ఆయన పరిశీలించారు. మండలానికి చేరిన గోదావరి జలాలకు పసుపు, కుంకుమ, పూలు చల్లి పూజలు నిర్వహించారు. అనంతరం పక్కనే ఏర్పాటు చేసిన హరితహారం నర్సరీని ప్రారంభించారు. రైతులు అడగక ముందే వారికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. దేశంలో, ప్రపంచంలో ఎవరూ అమలు చేయలేనటువంటి ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తోన్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.
ఇవీ చూడండి:కుక్కను వదులుకోలేక.. ప్రాణాలే వదిలేసింది