హరిత తెలంగాణ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని డోర్నకల్ శాసన సభ్యుడు డీఎస్ రెడ్యానాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మున్సిపాలిటీలో నిర్వహించిన హరితహారం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో మొక్కలు నాటి నీళ్లు పోశారు. అనంతరం హరితహారం విజయవంతానికి ఏర్పాటు చేసిన ఆటో ప్రచారంలో ఆయన పాల్గొన్నారు.
ఆటోలో కూర్చుని స్వయంగా మైక్ ద్వారా ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంట్లో తమకు నచ్చిన మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. తెలంగాణలో ఈ సారి 30 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా తెరాస ప్రభుత్వం ముందడుగువేస్తుందన్నారు. మహబూబాబాద్ జిల్లాలో 90 లక్షల మొక్కలు నాటనున్నట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఎమ్మెల్యే వినూత్న రీతిలో నిర్వహించిన ఆటో ప్రచారం తీరు మున్సిపాలిటీ ప్రజలను ఆకట్టుకుంది.
ఇవీ చూడండి: కరోనా ఎఫెక్ట్: నెలరోజుల్లో ఎన్నివేల కోట్లు తాగేశారో తెలుసా?