మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం రేపోని, వాల్యాతండా శివారు సింగి తండా నుంచి దాట్ల రోడ్డు వరకు నిర్మించనున్న తారు రోడ్ల నిర్మాణ పనులకు, రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే రెడ్యానాయక్ శంకుస్థాపన చేశారు.
ఆయా గ్రామాలకు చెందిన పలువురు రైతులకు ప్రభుత్వం కేటాయించిన పట్టాదారు, పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఎస్సారెస్పీ జలాలతో నియోజకవర్గంలోని అన్ని చెరువులు నింపామన్నారు. ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా శుద్ధి చేసిన తాగునీరు అందిస్తున్నట్లు చెప్పారు. ప్రతి గ్రామంతో పాటు తండాలకు తారు రోడ్ల సౌకర్యం కల్పించనున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: మురికి వదలనుంది: మూసీ ప్రక్షాళనకు మూడు ప్రణాళికలు!