అర్హులైన నిరుపేదలందరికీ ప్రభుత్వం రెండు పడక గదుల ఇళ్లను మంజూరు చేస్తుందని డోర్నకల్ శాసనసభ్యుడు రెడ్యానాయక్ చెప్పారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం బీరిశెట్టిగూడెంలో రూ.2.50 కోట్ల రూపాయలతో నిర్మించనున్న రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.

నిరుపేదల సొంతింటి కలను తెలంగాణ ప్రభుత్వం సాకారం చేస్తోందన్నారు. నిర్మాణ పనులను వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: గాంధీ జయంతి: సత్యాగ్రహ నినాదం.. నిశ్శబ్ద పోరాటం