వర్షాలు పడి మహబూబాబాద్ జిల్లాలో అన్ని చెరువులు నిండాయని... ఈసారి మంచి పంటలు పండుతాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. చెరువులు నిండినందున చేపలు పంపిణీచేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను కోరారు. తొర్రూరులో మంత్రి తలసానితో కలిసి పర్యటించారు. 2వేల మందికి తెలంగాణ పాడి పరిశ్రమ అభివృద్ధి, తొర్రూరు సహకార సంఘం ఆధ్వర్యంలో కిసాన్ క్రెడిట్ కార్డులను పంపిణీ చేశారు.
హరితహారంలో భాగంగా విజయ డైరీ ఆవరణలో మొక్కలు నాటారు. విజయ డైరీ మొబైల్ అవుట్లేట్లను మంత్రులు ఎర్రబెల్లి, తలసాని, ఎంపీలు బండ ప్రకాష్, పసునూరి దయాకర్ ప్రారంభించారు. తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో ప్రజలందరికి ఎర్రబెల్లి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మాస్కులను పంపిణీ చేయాలని వార్డు కౌన్సిలర్లకు మంత్రి ఎర్రబెల్లి అందించారు.