మహబూబ్నగర్ జిల్లా జనరల్ ఆసుపత్రికి వచ్చే.. రోగుల బంధువులకు భోజనం దొరక్క తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండటం వల్ల మంత్రి శ్రీనివాస్ గౌడ్ భోజనాన్ని అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంత్రి తన తండ్రి స్మారకార్థం ఏర్పాటు చేసిన.. శాంతా నారాయణ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
లాక్డౌన్ నేపథ్యంలో హోటళ్లు సైతం మూతపడటం వల్ల రోగుల వెంట వచ్చిన సహాయకులు ఇబ్బందులు పడుతున్నారని... వారికి ప్రతిరోజు మధ్యాహ్నం ఆసుపత్రి ఆవరణలో ఉచితంగా భోజనం అందించనున్నామని వెల్లడించారు.
ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగుల సహాయకులకు లాక్డౌన్ కారణంగా భోజనానికి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతి రోజు మధ్యాహ్నం ఉచితంగా భోజనం అందించేందుకు ముందుకు వచ్చినట్లు ట్రస్ట్ ఛైర్మన్ శ్రీహిత వెల్లడించారు. లాక్డౌన్ ముగిసే వరకు ఉచితంగా భోజనం అందించనున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: సెంట్రల్ జైలులో ఖైదీలతో సీఎం ముచ్చట