ETV Bharat / state

అనవసరంగా రోడ్లపైకి రావొద్దు: సత్యవతి రాఠోడ్​ - telangana latest news

అత్యవసరమైతే తప్ప ప్రజలు రోడ్లపైకి రావొద్దని మంత్రి సత్యవతి రాఠోడ్​ విజ్ఞప్తి చేశారు. కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. మహబూబాబాద్​లో అమలవుతున్న లాక్​డౌన్​ తీరును ఆమె పరిశీలించారు.

సత్యవతి రాఠోడ్​
సత్యవతి రాఠోడ్​
author img

By

Published : May 20, 2021, 8:41 AM IST

మహబూబాబాద్ జిల్లాలో లాక్​డౌన్ సమర్థంగా అమలవుతుందని గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్​ పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఎస్పీ నంద్యాల కోటిరెడ్డితో కలిసి పోలీస్ చెక్​పోస్ట్​లు, లాక్​డౌన్ అమలు తీరును పరిశీలించారు.

లాక్​డౌన్​ నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని మంత్రి పేర్కొన్నారు. అనవసరంగా రోడ్లపైకి రావొద్దని విజ్ఞప్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 750 ఫీవర్​ సర్వే బృందాలు మరోసారి సర్వే చేయనున్నారని.. ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా బృందానికి తెలియజేయాలని సూచించారు. జిల్లాలో 250 ఆక్సిజన్ పడకలు అందుబాటులో ఉన్నాయని, కరోనా బాధితులు ఎలాంటి భయాందోళనకు గురికావొద్దని సూచించారు.

13 చెక్​పోస్టులు..

లాక్​డౌన్​ను పకడ్బందీగా అమలు చేసేందుకు జిల్లా వ్యాప్తంగా 13 చెక్​పోస్టులు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి పేర్కొన్నారు. కూరగాయల మార్కెట్​ల వద్ద ప్రజలు గుమిగూడకుండా జిల్లాలోని 4 మున్సిపాలిటీల్లో కూరగాయలను ఒకేచోట కాకుండా.. వేర్వేరు ప్రాంతాల్లో అమ్మేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఉదయం 10 గంటల తర్వాత అనవసరంగా బయటకు రావొద్దని.. వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇదీ చూడండి: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్, సభ్యుల నియామకం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.