కరోనా రోగులు మనోధైర్యంతో వ్యాధిని ఎదుర్కోవాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ సూచించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో రూ.68 లక్షలతో నిర్మించిన 30 ఆక్సిజన్ పడకల కొవిడ్ బ్లాక్‌ను ఎమ్మెల్యే శంకర్ నాయక్, జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ బిందు, కలెక్టర్ గౌతమ్‌లతో కలిసి ప్రారంభించారు.
జిల్లా ప్రజల ఆరోగ్య పరిరక్షణకు గొప్ప మనసుతో ముందుకు వచ్చిన దాతలకు మంత్రి సత్యవతి కృతజ్ఞతలు తెలిపారు. కరోనా వంటి కష్టకాలంలో బాధితులను ఆదుకోవడానికి మరికొంత మంది దాతలు ముందుకు రావాలని కోరారు. ప్రజలంతా లాక్డౌన్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అభిలాష అభినవ్, మున్సిపల్ ఛైర్మన్ రామ్మోహన్ రెడ్డి, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకట్రాములు, ఆర్.ఎం.ఓ డాక్టర్ చింతా రమేశ్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి హరీశ్ రాజ్, జిల్లా కొవిడ్ కో-ఆర్డినేటర్ డాక్టర్ రాజేశ్ పాల్గొన్నారు.
- ఇదీ చదవండి : వ్యాక్సిన్ వద్దని నదిలో దూకి పరార్!