మహబూబాబాద్‌లోని బార్ అసోసియేషన్ భవనంలో మంత్రి సత్యవతి రాఠోడ్, ఎంపీ మాలోత్ కవిత, జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ బిందులు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. న్యాయవాదులను కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని వారు కోరారు.
మన అందరి పోరాటం వల్ల ఏర్పడిన ఈ జిల్లాను అభివృద్ధి చేసుకునే బాధ్యత మన అందరిపై ఉందని మంత్రి అన్నారు. జిల్లా ఏర్పాటైన తర్వాత 300 పడకల ఆస్పత్రి మంజూరు అయ్యిందని...మెడికల్ కాళాశాల, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ రానుందని తెలిపారు.
మున్సిపాలిటీ అయ్యాక సెంట్రల్ లైటింగ్ కూడా చేసుకున్నామని పేర్కొన్నారు. 70 ఏళ్లలో కానిది.. ఈ ఏడేళ్లలో చేసుకున్నామని చెప్పారు. ఇంకా చేసుకోవాల్సింది చాలా ఉందన్నారు.
ఇదీ చూడండి : కొత్తగా 375 జంబో బ్యాలెట్ బాక్సులు