మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ గౌతమ్ ఆధ్వర్యంలో వైద్యులకు, పారిశుద్ధ్య కార్మికులకు, పాత్రికేయులకు మాస్కులు, శానిటైజర్లను మంత్రి సత్యవతి రాఠోడ్ పంపిణీ చేశారు. లాక్డౌన్ సడలింపులతో కరోనా వైరస్ అంతరించిందని అనుకోవద్దని పేర్కొన్నారు.
అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనవసరంగా బయటకు రావద్దని తెలిపారు. వలస కూలీల సహాయార్థం శ్రీనివాస రెడ్డి, శ్రీధర్, సురేష్ రావులు అందజేసిన మూడు లక్షల చెక్కును మంత్రి కలెక్టర్కు అందించారు.