ETV Bharat / state

బాధిత కుటుంబాలను పరామర్శించిన మంత్రి సత్యవతి రాఠోడ్​

మహబూబాబాద్​ జిల్లా నల్లెల్ల గ్రామంలో వివిధ కారణాలతో మృతి చెందిన బాధిత కుటుంబాలను మంత్రి సత్యవతి రాఠోడ్​ పరామర్శించారు. బాధిత కుటుంబాలకు రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం చేశారు.

minister satyavathi rathod consolate victims families in mahabubabad district
బాధిత కుటుంబాలను పరామర్శించిన మంత్రి సత్యవతి రాఠోడ్​
author img

By

Published : Jun 12, 2020, 7:36 PM IST

మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం నల్లెల్ల గ్రామంలో వివిధ కారణాలతో మృతి చెందిన బాధిత కుటుంబాలను రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్‌ పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఇటీవల ఈతకు వెళ్లి వ్యవసాయ బావిలో పడి ఇద్దరు బాలురు మృతి చెందారు. బాలుర కుటుంబాలను మంత్రి పరామర్శించారు. కుటుంబ గొడవలతో బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న వృద్ధురాలి కుటుంబాన్ని, అనారోగ్యంతో మృతి చెందిన మరో బాధిత కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వీరి కుటుంబాలకు రూ.15 వేల ఆర్థిక సహాయం అందజేశారు.

అనంతరం బీబీనాయక్‌ తండాలో జరిగిన ఓ వివాహ వేడుకలో ఆమె పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆమె వెంట జడ్పీ ఛైర్‌ పర్సన్‌ బిందు, జడ్పీటీసీ సభ్యుడు వెంకట్‌రెడ్డితో పాటు మండల నాయకులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: రాష్టంపై మిడతల దండు ప్రభావం ఉండకపోవచ్చు...!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.