ETV Bharat / state

మంత్రి సత్యవతి కాన్వాయ్​కు తప్పిన ప్రమాదం - minister satyavathi convoy missed an accident

Accident minister Sathyavathi Convoy: మహబూబాబాద్​ జిల్లా మరిపెడ వద్ద మంత్రి సత్యవతి కాన్వాయ్​కు ప్రమాదం తప్పింది. కాన్వాయ్​ వెళ్తుండగా మార్గమధ్యలో పంది అడ్డు రావడంతో రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఘటనలో మంత్రి సత్యవతి సురక్షితంగా బయటపడ్డారు. కాగా ఆమె గన్​మెన్​లకు స్వల్ప గాయాలయ్యాయి.

minister satyavathi convoy missed an accident
మంత్రి సత్యవతి కాన్వాయ్​కు తప్పిన ప్రమాదం
author img

By

Published : May 5, 2022, 2:30 PM IST

Accident minister Sathyavathi Convoy: గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్‌ కాన్వాయ్‌లోని రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడలో చోటుచేసుకుంది. మంత్రి సత్యవతి రాథోడ్ హైదరాబాద్ నుంచి మహబూబాబాద్‌ వెళ్తున్నారు. ఈ క్రమంలో కార్గిల్ సెంటర్ సమీపంలోకి రాగానే కాన్వాయ్​కు పంది అడ్డు రావటంతో డ్రైవర్‌ సడెన్ బ్రేక్ వేశాడు. దీంతో వెనక వస్తున్న మరో వాహనం వేగంగా ఢీకొన్నట్లు సమాచారం.

ఈ ప్రమాదంలో మంత్రి గన్​మెన్​లకు స్వల్ప గాయాలు కాగా.. మంత్రి సత్యవతి సురక్షితంగా మహబూబాబాద్‌కు చేరుకున్నారు. స్థానిక పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని వాహనాలను అక్కడినుంచి తరలించారు.

ఇవీ చదవండి: 'ఆదిలాబాద్​కు భారీగా ఆయుధాలు.. పాక్​ కుట్ర భగ్నం.. నలుగురు అరెస్ట్'

'రాహుల్ జీ..​ వైట్​ ఛాలెంజ్​కు రెడీనా..?'.. కలకలం రేపుతున్న ఫ్లెక్సీలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.