Minister Harishrao Road Show In Mahabubabad : సమైక్య వాదులు దండయాత్రకు వచ్చిన రోజు మానుకోట ప్రజలు తరిమికొట్టారని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు మానుకోట ఘటనను గుర్తు చేశారు. మహబూబాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ ఎమ్యెల్యే అభ్యర్ధి శంకర్ నాయక్(BRS Candidate Shankar naik) గెలుపును కోరుతూ నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. మానుకోట దెబ్బతో సమైక్య వాదులు వెనుకకు పరిగెత్తారని, మళ్లీ సమైక్యవాదులు ఒక్కటై తెలంగాణ మీద దండెత్తడానికి వస్తున్నారని, వారికి మన మానుకోట దమ్మేంటో చూపించాలని కోరారు. శంకర్ నాయక్ నోరు కఠినమైనా సిద్ధిపేట కంటే అభివృద్ధి బాగా చేశారని, గులాబీ జెండా లేకుంటే మానుకోట జిల్లా అయ్యేదా, మెడికల్ కాలేజ్, ఇంజినీరింగ్ కాలేజ్, హార్టికల్చర్ కాలేజ్ వచ్చేదా అని ప్రశ్నించారు.
కేసీఆర్‌కు సీఈసీ వార్నింగ్ - అలా చేస్తే చర్యలు తప్పవంటూ లేఖ
Harishrao Fires On Congrss : పోడు భూములకు పట్టాలు ఇచ్చామని, రాహుల్ గాంధీ(Rahul Gandi), ప్రియాంక గాంధీలు కర్ణాటకలో ప్రచారం చేసి ఐదు గ్యారంటీలు అని ఊదరగొట్టి మోసం చేశారని, కర్ణాటకలో కరెంటు రాక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, రేవంత్‌రెడ్డికి ఏ విషయం మీద పూర్తి అవగాహన లేదని, కాళేశ్వరం ప్రాజెక్టు ఇసుక మీద కట్టకుండా.. రేవంత్ రెడ్డి నెత్తిమీద కట్టాలా.. అని ప్రశ్నించారు. బూతులు మాట్లాడే నాయకులు కావాలా.. భవిష్యత్తు అందించే నాయకుడు కావాలో.. మీరే ఆలోచించుకోవాలని ప్రజలను కోరారు. బోరింగులు మాయమైపోయాయని, ఇంటింటికీ నల్లా నీళ్లు వస్తున్నాయని హరీశ్ కితాబిచ్చారు. ఉచిత కరెంటు అని చెప్పి ఉత్త కరెంట్ చేసింది కాంగ్రెస్. కాంగ్రెస్ కావాలా? కరెంట్ కావాలా? కరెంట్ కావాలంటే కారుకు ఓటు గుద్దు.. రిస్క్ వద్దు అనుకుంటే కారుకు గుద్దాలని.. కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు.
రైతుబంధు నిధుల విడుదలతో కేసీఆర్, మోదీ బంధం బయటపడింది : రేవంత్ రెడ్డి
Harishrao Comments On Revanth Reddy : రైతుబంధు విషయంలో కాంగ్రెస్ కుట్ర చేసింది. కేసీఆర్ చేసిన కృషి వల్ల రైతుబంధు(Raithubandu) డబ్బులు సోమవారం రోజు ఖాతాల్లో పడతాయని, రైతులను బిచ్చగాళ్లు అన్న రేవంత్ రెడ్డికి రైతులే గుణపాఠం చెప్తారన్నారు. ఇప్పటివరకు 90 శాతం హామీలను నెరవేర్చామని, రుణమాఫీ కూడా త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. ఈ దఫా ఇళ్లు కట్టడంపై దృష్టి సారిస్తామని, మూడోసారి గెలిస్తే అసైన్డ్ భూములకు హక్కులు కల్పిస్తామని హరీశ్ రావు వెల్లడించారు.
BRS Election Campaign : రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తామని, మహిళలకు 400కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పారు. లంబాడీలకు అత్యధిక ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చింది కేసీఆరే అని, గిరిజన బంధును ఈసారి పక్కాగా అమలు చేస్తామని హరీశ్ రావు(Harishrao) హామీనిచ్చారు. ఈ రోడ్ షోలో మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ కవిత, జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ బిందు, మున్సిపల్ ఛైర్మన్ రామ్మోహన్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.
'కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ చేస్తున్నారంటే - కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కుమారుడు పుట్టినట్టే'
రాష్ట్రానికి ర్యాపిడ్ రైలు - గంటలో హైదరాబాద్ నుంచి ఎక్కడికైనా గంటలో వెళ్లొచ్చు!