రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కల్పించిన అవకాశాల వల్లే తాను గొప్ప స్థానాన్ని పొందానని గిరిజన, స్త్రీ శిశు, సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. అంబేడ్కర్ 129వ జయంతి సందర్భంగా మహబూబాబాద్‌లోని తన నివాసంలో అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం జర్నలిస్టులకు మాస్కులు, గిరిజన కో-ఆపరేటివ్ కార్పొరేషన్ తయారు చేసిన శానిటైజర్లను పంపిణీ చేశారు. అనేక ఇబ్బందులున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను ప్రజల సంక్షేమం కోసమే పొడిగించారని మంత్రి తెలిపారు. ప్రజలందరూ ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.