మతిస్థిమితం కోల్పోయిన ఓ వ్యక్తి వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం కుమ్మరికుంట్లలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన తండ రజనీకాంత్(37) ఈ నెల 1 న ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. మతిస్థిమితం సరిగా లేని రజనీకాంత్... గ్రామ శివారులోని పాలేరువాగులో విగతజీవిగా కన్పించాడు. మృతుడికి భార్యా, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. రజనీకాంత్ ఆత్మహత్య చేసుకున్నాడా... ప్రమాదవశాత్తు జరిగిందా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: మున్సిపోల్లో పోటీ లేదు.. అన్ని తెరాసకే: కేసీఆర్