మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మార్వాడి సమాజ్ ఆధ్వర్యంలో మార్వాడీలు కామదహన కార్యక్రమం నిర్వహించారు. మార్వాడీ మహిళలు ఊడ్చి, కళ్లాపి చల్లి ముగ్గులు వేసి ఆముదం చెట్టును నాటారు. దాని చుట్టూ ఆవు పిడకలతో చేసిన దండలను అలంకరించారు.
పాటలు పాడుకుంటూ దాని చుట్టూ భజనలు, నృత్యాలు చేసుకుంటూ కాముడిని దహనం చేశారు. పురుషులు, మహిళలు ఒకరిపై ఒకరు రంగులు, పూలు చల్లుకుంటూ హోలీ పండుగను జరుపుకున్నారు. నిండు పౌర్ణమి వేళ ఈ వేడుకలను జరుపుకోవడం అనవాయితీగా వస్తుంది.
ఇదీ చూడండి : అందమైన అమ్మాయి... ఆకట్టుకుంది ఈ వేళ