మావోయిస్టు నాయకురాలు శారదక్క జనజీవన స్రవంతిలో కలిశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శారదక్క డీజీపీ ఎదుట లొంగిపోయారు. మహబూబాబాద్ జిల్లా గంగారానికి చెందిన శారదక్క 1994లో పీపుల్స్ వార్ పార్టీకి ఆకర్షితులై అజ్ఞాతంలోకి వెళ్లారు. గతంలో చర్ల-శబరి ఏరియా కమిటీ సభ్యురాలిగా పనిచేశారు. ప్రస్తుతం జిల్లా కమిటీ సభ్యురాలి హోదాలో ఉన్నారు.
మావోయిస్టు తెలంగాణ కార్యదర్శిగా పనిచేసిన హరిభూషణ్కు శారద భార్య. జూన్ 21వ తేదీన హరిభూషణ్ కరోనాబారిన పడి మృతి చెందారు. ఆ సమయంలో శారత సైతం కరోనాబారిన పడ్డారు. ఆమె తీవ్ర అస్వస్థకు గురై క్రమంగా కోలుకున్నారు.
ఇదీ చూడండి: AOB: ఏవోబీలో మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు