ఒకవైపు పంట దిగుబడి లేదు... మరోవైపు అరకొరగా పండిన పంటను అమ్ముకుందామంటే లాక్డౌన్, కొనుగోలు కేంద్రాలు లేకపోవడం వంటి కారణాలతో మామిడి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో మహబూబాబాద్ మామిడి రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. గత ఏడాదితో పోల్చితే ఈ సంవత్సరం మామిడి దిగుబడి తగ్గింది. మామిడి తోటల యజమానులు, తోటలను గుత్తకు తీసుకున్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిన విధంగానే, మామిడి కొనుగోలు కేంద్రాలను కూడా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. అలాగే నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వానికి రైతులు విన్నపించుకుంటున్నారు.
జిల్లాలో 17,500 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న మామిడి తోటల ద్వారా సుమారు 20 నుంచి 25 వేల మెట్రిక్ టన్నుల మామిడి దిగుబడి రావాలి. కానీ వాతావరణ పరిస్థితులు కారణంగా ఈ సంవత్సరం 8 నుంచి 10 వేల మెట్రిక్ టన్నుల దిగుబడి మాత్రమే వచ్చే అవకాశం ఉందని ఉద్యానవన శాఖ అధికారులు చెబుతున్నారు.
ఇదీ చూడండి: 'మహారాష్ట్ర కచ్చితంగా కరోనా ప్రమాదంలో ఉంది'