మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం చింతలగట్టుతండా వద్ద పాలేరువాగుపై చెక్‌డ్యాం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మండలంలోని నీలికుర్తి గ్రామానికి చెందిన శ్రీను సెంట్రింగ్ పనుల కోసం కూలీగా వెళ్లారు. ప్రమాదవశాత్తు మట్టిదిబ్బ కూలి మీదపడగా.. చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే శ్రీను మరణించారు.
పోలీసులు మృతదేహాన్ని కుటుంబసభ్యులకు ఇవ్వకుండా పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న బంధువులు మరిపెడ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొనగా.. పోలీసులు మృతుని కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వగా వారు ఆందోళనను విరమించారు.
ఇదీ చదవండి: వలస కూలీలను ఫోన్ నంబర్‌తో పట్టేస్తారు