గత మంగళవారం పోలీస్ స్టేషన్ ముందే భార్యను ఘోరంగా చంపిన భర్తను మహబూబాబాద్ జిల్లా మరిపెడ పోలీసులు అరెస్టు చేశారు. అబ్బాయి పాలెం శివారు ధరావతు తండాకు చెందిన బానోతు కస్తూరికి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కొత్త తండాకు చెందిన బానోతు సేవియాతో ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత కొద్దిరోజులుగా భార్యాభర్తల మధ్య కుటుంబ తగాదాలు చోటు చోసుకోవటం వల్ల కస్తూరి పుట్టింట్లో ఉంటోంది. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ క్లినిక్లో స్వీపర్గా పనిచేసుకుంటూ... అక్కడే పిల్లలను చదివిస్తోంది. కాపురానికి రావటం లేదని భార్యపై కక్ష పెంచుకున్న సేమవియా.. గత నెల 30న క్లినిక్లో ఉన్న కస్తూరితో మాట్లాడాలని పిలిచి కత్తితో గొంతుకోసి హత్య చేశాడు. నిందితుడిని అదుపులోకి తీసుకొని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు డీఎస్పీ వెల్లడించారు.
ఇవీచూడండి: పోలీసు స్టేషన్ ముందే భార్యను చంపిన భర్త