మనిషి చేయలేని, కనిపెట్టలేని అనేక విషయాలను కనుగొని పోలీసులకు ఆయుధంగా పనిచేస్తున్న మహబూబాబాద్ పోలీస్ కార్యాలయంలోని పోలీస్ జాగిలానికి లియో అని ముద్దుగా పిలుచుకుంటారు. జిల్లాల విభజన అనంతరం వరంగల్ పోలీస్ కార్యాలయం నుంచి మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయానికి దానిని తీసుకొచ్చారు.
లియో మందుపాతరలను గుర్తిస్తూ పలు బందోబస్తుల్లో విధులు నిర్వహించి శభాష్ అనిపించుకుంది. కాగా ఆ జాగీలం జీవితకాలం 10 సంవత్సరాలు కాగా అనారోగ్యం కారణంగా అర్ధాంతరంగా తనువు చాలించింది. అయితే లియో మృతితో ఏఆర్ డీఎస్పీ జనార్దన్ రెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. జాగిలమేకదా అని తీసి అవతల పడేయకుండా దాన్ని గౌరవించి పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
ఇదీ చదవండి: హోం క్వారంటైన్లో ఉన్నవారికి కరోనా కిట్లు