మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవితకు కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో హోంఐసోలేషన్‌లో ఉన్నట్లు వెల్లడించారు. కొవిడ్ లక్షణాలు కనిపించడం వల్ల పరీక్ష చేయించుకోగా.. పాజిటివ్ నిర్ధరణ అయింది. ఈ మధ్య కాలంలో తనను కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని, కొవిడ్ లక్షణాలు ఉంటే పరీక్ష చేయించుకోవాలని సూచించారు. అందరూ అప్రమత్తంగా ఉండి కొవిడ్ మహమ్మారిని ఎదుర్కోవాలని తెలిపారు.