మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మచ్చర్ల గ్రామ శివారులోని 'చింతలగట్టు వట్టివాగు మినీ మేడారం జాతర'లో ఎమ్మెల్యే శంకర్ నాయక్, ములుగు ఎమ్మెల్యే సీతక్కలు వన దేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గిరిజన పూజారులు సంప్రదాయ పద్దతిలో వారికి ఘనంగా స్వాగతం పలికారు. మేడారంలో జరిగే జాతర లాగానే 3 రోజుల పాటు ఈ జాతర జరుగుతుందని ఆలయ ప్రధాన పూజారి ధారం సిద్ధు తెలిపారు
గిరిజనులతో సీతక్క నృత్యం
మారుమూల ప్రాంతాల్లోని ప్రజలు చెట్టును పుట్టను దైవాలుగా నమ్ముకుని పూజిస్తారని... ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ప్రభుత్వం స్థానిక ప్రజల మనోభావాలకు అనుగుణంగా భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. మినీ మేడారం జాతరలు జరిగే ప్రాంతాలలో కనీసం జాతరకు రూ.25 లక్షలను కేటాయించాలని డిమాండ్ చేశారు. గిరిజనులతో కలిసి సీతక్క నృత్యం చేశారు. ఈ మినీ మేడారం జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి వన దేవతలను దర్శించుకుంటున్నారు.
ఇదీ చదవండి: సీజీఎస్టీ కమిషనర్ బొల్లినేని శ్రీనివాస్ గాంధీ సస్పెండ్