రాష్ట్రంలో నేటి నుంచి లాక్డౌన్ సమయాన్ని కాస్త సడలించటంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. రహదారులపై సాధారణ ట్రాఫిక్ కనపడింది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఒంటి గంటకే వ్యాపార, వాణిజ్య సముదాయాలను స్వచ్ఛందంగా మూసివేశారు. జిల్లా కేంద్రంలో ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి పర్యటించారు. పలు సెంటర్లు, చెక్ పోస్టులను సందర్శించి లాక్ డౌన్ పరిస్థితిని పరిశీలించారు.
సడలింపు సమయం తరువాత రహదారులపై సంచరిస్తున్న వాహనదారులను అడ్డుకుని వాహనాలు సీజ్ చేసారు. మాస్కులు ధరించని వారికి జరిమానా విధించారు. ప్రజలంతా కచ్చితంగా లాక్డౌన్ నిబంధనలు పాటించాలని ఎస్పీ కోటిరెడ్డి సూచించారు. ఇంట్లోనే ఉండి తమకు సహకరించాలని కోరారు.
- ఇదీ చదవండి : ఆనందయ్య మందు.. కోటయ్య మృతి