మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో నిర్వహిస్తున్న మూడో రాష్ట్ర స్థాయి సీనియర్ నెట్ బాల్ ఛాంపియన్ షిప్ పోటీలు ముగిశాయి. ఈ ముగింపు పోటీలకు ఎమ్మెల్యే శంకర్ నాయక్ హాజరయ్యారు.
ఈ పోటీల్లో పురుషుల విభాగంలో మహబూబ్నగర్ జట్టు మొదటి స్థానంలో.. ఖమ్మం జట్టు రెండో స్థానంలో నిలిచింది. మహిళల విభాగంలో ఖమ్మం జట్టు మొదటి స్థానంలో.. మహబూబ్నగర్ జట్టు రెండో స్థానంలో నిలిచింది. విజేతలకు ఎమ్మెల్యే శంకర్ నాయక్ బహుమతులను అందించారు.
ఇదీ చదవండి:ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది దుర్మరణం