ETV Bharat / state

మరిపెడలో అంతర్‌ జిల్లా దొంగ అరెస్ట్ - mahabubabad crime news

మహబూబాబాద్ జిల్లా మరిపెడ పోలీసులు అంతర్‌ జిల్లాల దొంగను అరెస్టు చేశారు. అరెస్టుకు సంబంధించిన వివరాలను తొర్రూరు డీఎస్పీ వెంకటరమణ వెల్లడించారు. నిందితుడి నుంచి కారు, బైక్, కత్తితో పాటు దొంగతనానికి సంబంధించిన బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.

mahabubabad-district-maripada-police-have-arrested-an-inter-district-thief
అంతర్‌ జిల్లా దొంగ అరెస్ట్ : తొర్రూర్‌ డీఎస్పీ
author img

By

Published : Dec 31, 2020, 8:48 PM IST

మహబూబాబాద్ జిల్లా మరిపెడ పోలీసులు అంతర్‌ జిల్లా దొంగను అరెస్టు చేశారు. మండల కేంద్రంలోని రాజీవ్ కూడలి వద్ద వాహనాల తనిఖీలు చేస్తుండగా.. అనుమానాస్పదంగా ద్విచక్ర వాహనం నడుపుతున్న వ్యక్తి ని అదుపులోకి తీసుకొని విచారించారు.

జల్సాలకు అలవాటు పడి ..

వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండ మండలం బొల్లికొండ గ్రామానికి చెందిన బాణోత్ అజయ్ (19) జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తున్నాడు. గతంలో నిందితుడిపై నెక్కొండ, చెన్నారావు పోలీస్‌ స్టేషన్లలో కేసులు నమోదై జైలుకు వెళ్లాడు.

కారం చల్లి.. కత్తితో పొడిచి..

జైలుకు వెళ్లొచ్చినా అతడి తీరు మార్చుకోలేదు. ఎదైనా పెద్ద చోరీ చేసి ఇతర రాష్ట్రానికి పారిపోయి హాయిగా జీవించాలని పథకం రచించాడు. అందులో భాగంగా.. హన్మకొండ బస్టాండ్‌లో డిసెంబర్‌ 11న ఒక కారును కిరాయికి మాట్లాడుకుని మరిపెడకు బయలు దేరాడు. మరిపెడ శివారులోకి చేరుకున్నాక మూత్ర విసర్జన కోసం కారును ఆపించాడు. తన వెంట బ్యాగ్‌లో తెచ్చుకున్న కారంపొడిని డ్రైవర్‌ కళ్లల్లో చల్లి, అతడిని కత్తితో పొడిచాడు. కారును దొంగిలించి అక్కడి నుంచి పరారయ్యాడు. చోరీ చేసిన కారును దంతాలపల్లి శివారులోని ఓ చెట్టుకు ఢీకొట్టి కారును అక్కడే వదిలి వెళ్లాడు.

మరో చోరీ..

దంతాలపల్లి మండల కేంద్రంలో ఓ ఇంటి ముందు నిలిపి ఉంచిన బైక్ ను చోరీ చేశాడు. కొంత దూరం వెళ్లాడు. తర్వాత బైక్‌ని చెట్ల పొదల్లో పడేసి వెళ్లాడు. డిసెంబర్‌ 20న తొర్రూరు నుంచి మరిపెడ మండలానికి బయలుదేరాడు. మండలంలోని అబ్బాయిపాలెం గ్రామానికి చేరుకున్నాడు. అక్కడ ఓ ఇంటి ముందు నిలిపిన మరో ద్విచక్ర వాహనాన్ని చోరీ చేశాడు.

విక్రయించేందుకు ప్రయత్నించి

చోరీ చేసిన వాహనాన్ని కేసముద్రం మండలాల్లో విక్రయించేందుకు ప్రయత్నించినా ఎవరు కొనకపోవడంతో ఖమ్మంలో విక్రయించేందుకు బయలుదేరాడు. ఈ క్రమంలో స్థానిక రాజీవ్ సెంటర్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా పోలీసులకు పట్టుబడ్డాడు. గతంలోనూ నిందితుడు నాలుగు దొంగతనాలు చేసినట్టు విచారణలో తెలిపినట్లు తొర్రూర్‌ డీఎస్పీ వెంకటరమణ తెలిపారు. నిందితుడి నుంచి కారు, బైక్, కత్తితో పాటు దొంగతనానికి సంబంధించిన బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.

ఇదీ చదవండి: మైనర్​తో వృద్ధుడి వివాహం కేసులో ఆరుగురు అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.