ETV Bharat / state

'రుణాల యాక్షన్​ ప్లాన్​ను విడుదల చేయాలి' - ఎస్సీ కార్పొరేషన్​ రుణాలు

మహబూబాబాద్​ జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్​ రుణాల మంజూరుకై యాక్షన్​ ప్లాన్​ను విడుదల చేయాలని కేవీపీఎస్ ఆధ్వర్యంలో కలెక్టర్​ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్​కు వినతి పత్రం సమర్పించారు.

Mahabubabad district KVPS demand for SC Corporation Action Plan for granting loans
రుణాల యాక్షన్​ ప్లాన్​ను విడదల చేయాలి
author img

By

Published : May 28, 2020, 6:56 PM IST

మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కేవీపీఎస్ ఆధ్వర్యంలో ఫ్లకార్డులు చేత పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. 2020-21 సంవత్సరానికి గాను ఎస్సీ కార్పొరేషన్ రుణాల మంజూరుకై యాక్షన్ ప్లాన్​ను విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. గతంలో ఇచిన రుణాలు మాఫీ చేయాలంటూ నినాదాలు చేశారు.

జిల్లా ఎస్సీ కార్పొరేషన్​కు రూ.1500 కోట్లను మంజూరు చేయాలని కేవీపీఎస్ కార్యదర్శి కుర్రా మహేష్ డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్​కు వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు దుడ్డెల రామ్మూర్తి, పట్టణ కార్యదర్శి యాకయ్య తదితరులు పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.