మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐటీడీఏ పీవో గౌతమ్ పాత్రోలు పర్యటించారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రికార్డులను పరిశీలించి గర్భిణీ స్త్రీలకు అందించే వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. ఇంకా మెరుగైన వైద్య సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. చర్లపల్లి గ్రామంలోని నర్సరీలో మొక్కల పెంపకం గురించి ఆరా తీశారు. అంగన్వాడి కేంద్రంలో చిన్న పిల్లలతో ముచ్చటించారు. ఇర్సులాపురం గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులతో కలిసి కలెక్టర్ పాఠాలు విన్నారు.
బయ్యారం ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో ప్రజల నుంచి విజ్ఞప్తులను కలెక్టర్ స్వీకరించారు. అత్యధికంగా భూ సమస్యలపై ఫిర్యాదులు అందజేశారు. భూ సమస్యల పరిష్కారం కోసం ఆర్డీవో, తహసీల్దార్, అటవీ శాఖ అధికారులతో క్షేత్రస్థాయిలో విచారణ జరిపిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతి నెల మొదటి 2 వారాలు ఆర్డీవో ఏజెన్సీ మండలాల్లో ప్రజావాణి నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.
ఇదీ చూడండి : 'ఆదాయానికి... బడ్జెట్ అంచనాలకు పొంతన లేదు'