అర్ధరాత్రి సమయంలో క్రషర్ మిల్లులో భారీ పేలుళ్ల వల్ల ఇబ్బంది పడుతున్నామని మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం నల్లకుంట తండా వాసులు ఆందోళనకు దిగారు. బ్లాస్టింగ్ను నిలిపేయాలంటూ వెంకటేశ్వర క్రషర్ మిల్లు వద్ద ఆందోళనకు దిగారు. తండాలోని ఇళ్ల గోడలు బీటలు వారి కూలిపోయే పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. శబ్దాలకు భయబ్రాంతులకు గురవుతున్నామని పేర్కొన్నారు.
తమ ఇబ్బందిని క్రషర్ యజమానికి చెప్పినప్పటికీ తీరు మారడం లేదని.. అధికారులు స్పందించడం లేదని వాపోయారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సర్దిచెప్పడం వల్ల ఆందోళన విరమించారు.
ఇదీ చూడండి: పాల ప్యాకెట్ల చోరీలు... సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు