బాలుడు దీక్షిత్ రెడ్డి హత్య ఘటన మహబూబాబాద్ జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్థానికుల్లో ఆగ్రహం పెల్లుబికింది. దీక్షిత్‌రెడ్డిని చంపిన కిడ్నాపర్‌ను ఎన్‌కౌంటర్ చేయాలని స్థానికులు పెద్దఎత్తున డిమాండ్ చేశారు.
నిందితుడికి సహకరించిన వారిని కూడా కఠినంగా శిక్షించాలని నినదించారు. బాలుడి ఇంటికి పెద్దఎత్తున స్థానికులు తరలివచ్చారు.. కుటుంబ సభ్యుల రోదనలతో దీక్షిత్ నివాసం దుఃఖసాగరంలో మునిగిపోయింది.
ఇదీ చూడండి : దీక్షిత్ కథ విషాదాంతం... కన్నీటి సంద్రంలో కుటుంబం