వరంగల్ రూరల్ జిల్లా పరకాలలోని గణపతి డిగ్రీ కళాశాలలో ఎల్ఐసీ పరకాల బ్రాంచ్ చీఫ్ మేనేజర్ నగోతు నాగేశ్వరరావు పదవి విరమణ సన్మాన సభ నిర్వహించారు. ఎల్ఐసీ ఉద్యోగులకే పదవీ విరమణ ఉంటుందని ఏజెంట్లకు విరమణ ఉండదని ఆయన తెలిపారు. పాలసీ హోల్డర్లకు మెరుగైన సేవలు అందించి వ్యాపారం అభివృద్ధి చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో కల్చరల్ కన్వీనర్ పూల మొగిలి పాడిన గీతాలు, మ్యాజిక్ షో అలరించాయి. నాగేశ్వరరావు దంపతులను గజమాల, శాలువాలు, మెమెంటోలతో సత్కరించారు.
ఇవీ చూడండి: 'పళ్లెత్తుగా ఉన్నాయని పెళ్లాన్నొదిలేశాడు'