జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలను మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. గాంధీ విగ్రహానికి కలెక్టర్ శివలింగయ్య, ఎస్పీ కోటిరెడ్డి, ఎంపీ మాలోత్ కవిత, జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ బిందు, వివిధ పార్టీలు, కుల సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్లాస్టిక్‌ను నిర్మూలించి.. పర్యావరణాన్ని పరిరక్షించాలంటూ మున్సిపల్ సిబ్బంది చేపట్టిన ర్యాలీలో ఎంపీ కవిత పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రజలు పోరాటం చేసి ఏ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారో.. అదేవిధంగా ప్రజలంతా ప్లాస్టిక్ నిర్మూలించి పర్యావరణాన్ని పరిరక్షించాని ప్రజలకు ఎంపీ కవిత విజ్ఞప్తి చేశారు.
ఇవీచూడండి: ప్లాగింగ్: దేశవ్యాప్తంగా ప్రారంభమైన 'స్వచ్ఛ' పరుగు