మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు అఖిల పక్ష పార్టీలు సంఘీభావం ప్రకటించాయి. ఉదయం అరెస్టు చేసిన ఆర్టీసీ కార్మికులను వెంటనే విడుదల చేయాలంటూ స్థానిక వివేకానంద సెంటర్లో రాస్తారోకో చేపట్టారు. అక్కడకు చేరుకున్న పోలీసులు 60 మంది అఖిలపక్ష పార్టీల కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆర్టీసీ బస్ డిపో, బస్టాండ్లో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
ఈ కథనం చదవండి: రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె