ETV Bharat / state

మహబూబాబాద్​లో మహమ్మారి విస్తరణ.. ఆదివారం 7 కేసులు నమోదు

మహబూబాబాద్​ జిల్లాలో కరోనా విజృంభన కొనసాగుతోంది. ఆదివారం ఒక్కరోజే జిల్లాలో 7 కేసులు నిర్ధరణ అయ్యాయి. మొత్తంగా జిల్లాలో ఇప్పటి వరకు 675 మందికి కొవిడ్​ పరీక్షలు నిర్వహించగా... 61 మందికి పాజిటివ్ అని తేలిందని.. మరో 27 మంది ఫలితాలు వెలువడాల్సి ఉందని వైద్యాధికారులు వెల్లడించారు.

latest corona cases in mahabubabad
మహబూబాబాద్​లో మహమ్మారి విస్తరణ.. ఆదివారం 7 కేసులు నమోదు
author img

By

Published : Jul 13, 2020, 8:24 AM IST

రాష్ట్రంలో కరోనా మహమ్మారి రోజురోజు విస్తరిస్తోంది. మహబూబాబాద్ జిల్లాలో ఆదివారం 7 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2 కేసులు గూడూరు పోలీస్ స్టేషన్​లో పనిచేస్తున్న కానిస్టేబుళ్లు, కేసముద్రం మండలం తాళ్లపూసపల్లిలో ముగ్గురికి, మహబూబాబాద్ మండలం రెడ్యాల గ్రామంలో ఓ వ్యక్తికి, డోర్నకల్ మండలంలో ఒకరికి వైరస్​ పాజిటివ్​గా నిర్ధరణ అయ్యాయి.

వీటితో మొత్తంగా జిల్లాలో 61 మంది మహమ్మారి బారినపడ్డారు. కాగా వీరిలో 25 మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మరో 31 మంది హోమ్ ఐసోలేషన్​లో ఉన్నారు. ముగ్గురు బాధితులు వివిధ దవాఖానాల్లో చికిత్స పొందుతున్నారు. ఇద్దరిని మహమ్మారి కబలించింది. జిల్లాలో 675 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని.. 27 మంది ఫలితాలు రావలసి ఉందని కొవిడ్​-19 జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ రాజేష్ తెలిపారు.

ఇవీచూడండి: మహంకాళి అమ్మవారికి ఆ ఇంటి నుంచి తొలి బోనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.