మహబూబాబాద్ జిల్లా కురవిలోని భద్రకాళీ సమేత శ్రీవీరభద్ర స్వామి కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. ముందుగా స్వామి వారు, అమ్మవారికి గ్రామస్థులు సంప్రదాయంగా ఎదుర్కోలు కార్యక్రమం నిర్వహించారు. అనంతరం చేపట్టిన కల్యాణోత్సవానికి మహబూబాబాద్ డీఎస్పీ నరేష్, ఆర్డీఓ కొమురయ్య స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య స్వామి వారి కల్యాణోత్సవం కనుల పండువగా సాగింది. భద్రకాళీ వీరభద్రస్వామి కల్యాణోత్సవాన్ని భక్త్తులు ఆసక్తితో తిలకించారు. ఈ వేడుకల్లో రాష్ట్ర గిరిజన మహిళా సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్, మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్‌తోపాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఇదీ చూడండి : వేగం పెరగదు.. ముందుకు సాగదు..!