కార్తిక పౌర్ణమి సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పార్వతి రామలింగేశ్వర స్వామి దేవిస్థానంలో తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. మహిళలు ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్తిక పౌర్ణమి వేళ దీపాలను వెలిగిస్తే సర్వ పాపాలు తొలగి.. సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని భక్తులు విశ్వసిస్తున్నారు.
ఇదీ చదవండిః భక్తిపారవశ్యం... భక్తులతో కిటకిటలాడుతున్న శివాలయాలు