కార్తిక పౌర్ణమి సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. సోమవారం, కార్తిక పౌర్ణమి రెండూ ఒకేరోజు రావడంతో మహిళలు ఆలయానికి భారీ సంఖ్యలో తరలి వచ్చారు. కార్తిక దీపాలు వెలిగించి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీపాల కాంతులతో ఆలయ ప్రాంగణమంతా వెలుగులీనింది.
కరోనా నేపథ్యంలో భక్తులు మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని ఆలయ ప్రధానార్చకులు కోరారు.
ఇదీ చదవండి: మనలోనే మార్పు రావాలి.. ఓటే వారధి కావాలి