మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సిగ్నల్ కాలనీలో 14 సంవత్సరాల బాలికకు 20 సంవత్సరాల అబ్బాయితో విహహం చేసేందుకు నిశ్చయించారు. సమాచారం తెలుసుకున్న ఐసీడీఎస్ అధికారులు పోలీసు సిబ్బందితో వచ్చి బాలిక తల్లిదండ్రులు, బంధువులతో మాట్లాడి పెళ్లి నిలిపివేశారు. అనంతరం వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు.
ఇద్దరిని కస్టడీలోకి తీసుకొని వరంగల్లోని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరుపరిచేందుకు తరలించారు. బాల్య దశలో వివాహాలు చేస్తే శారీరకంగా ఇబ్బందులు తలెత్తుతాయని సంబంధిత అధికారులు అవగాహన కల్పించారు. రక్త హీనత వ్యాధి వస్తుందని, తద్వారా వారికి పుట్టే పిల్లలకు మానసికమైన రుగ్మతలు వస్తాయని సూచించారు. జిల్లాలో బాల్య వివాహాలు ఎక్కడ జరుగుతున్నాయో తెలిస్తే వెంటనే 1098కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని అధికారులు కోరారు.